India To Play Against Sri Lanka With Squad Of White-Ball Specialists | Oneindia Telugu

2021-05-10 439

BCCI president Sourav Ganguly on Sunday said that the Indian team, sans the top players, will tour Sri Lanka in July for a limited overs bilateral series.
#ICCWTCFinals
#IndiatourSriLanka
#WTCFinalsIndiaSquad
#kuldeepyadav
#AakashChopra
#IndiavsNewZealand
#IPL2021
#PrithviShaw
#indiatourofEngland
#IndianTeamforWTCFinals
#ViratKohli
#IndiaPlayingXIvsnz
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors

ఈ ఏడాది చివరి వరకు టీమిండియా ఫుల్ బిజీగా ఉండనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌, శ్రీలంక సిరీస్, ఇంగ్లండ్‌ సిరీస్‌, టీ20 ప్రపంచకప్.. కుదిరితే ఐపీఎల్ 2021 ఇలా వరుస పర్యటనలతో కోహ్లీసేన షెడ్యూల్ బిజీగా ఉంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఇంకో మూడు వారాల్లో లండన్ బయల్దేరబోతోంది భారత జట్టు. జూన్‌ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిశాక కోహ్లీసేన అక్కడే ఉండి కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాక, ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.శ్రీలంక పర్యటనలో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్ యాదవ్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ చహర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రాహుల్‌ తెవాతియా లాంటి కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపే అవకాశముంది. మనీష్ పాండే, దినేష్ కార్తీక్ కూడా రేసులో ఉండొచ్చు. ఇక గాయం నుంచి కోలుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా లంకకు వెళ్తాడు. వీళ్లందరికీ టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.